Tuesday, September 25, 2018

ఉమాసహస్రం - 1.2.25 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.24 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.23 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.22 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.21 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.20 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.19 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.18 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.17 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.16 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.15 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.14 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.13 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.12 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.11 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.10 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.9 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.8 (కావ్యకంఠ గణపతి ముని)


Monday, September 24, 2018

ఉమాసహస్రం - 1.2.7 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.6 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.5 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.4 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.3 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.2 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.2.1 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.1.25 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.1.24 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.1.23 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.1.22 (కావ్యకంఠ గణపతి ముని)


ఉమాసహస్రం - 1.1.21 (కావ్యకంఠ గణపతి ముని)


Tuesday, September 18, 2018

ఉమాసహస్రం - 1.1.20 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకం, ప్రథమస్తబకం
౨౦వశ్లోకము
🌺
మూలము
మన్యన్తే కేఽపి ఘనం పర్వతముక్తం నిగూఢయా వాచా ।
ప్రాదుర్భవతి గభీరధ్వని రవిషహ్యా యతః శక్తిః ॥౧.౧.౨౦॥
🌺
పదవిభాగము
మన్యన్తే కే అపి ఘనం పర్వతం ఉక్తం నిగూఢయా వాచా ప్రాదుర్భవతి గభీరధ్వనిః అవిషహ్యా యతః శక్తిః ॥౧.౧.౨౦॥
🌺
ప్రతిపదార్థము
కే అపి = కొందరు
నిగూఢయా = రహస్యమయిన
వాచా = వాక్కుతో
ఉక్తం = చెప్పబడిన
ఘనం = మేఘమును
పర్వతం = పర్వతమునుగా
మన్యన్తే = భావించుచున్నారు
యతః = ఏ మేఘము నుండి
గభీరధ్వనిః = గంభీరమయిన ధ్వని గల
అవిషహ్యా = సహించరాని
శక్తిః = విద్యుద్రూపమగు శక్తి
ప్రాదుర్భవతి = ప్రకటితమగుచున్నదో
🌺
తాత్పర్యము
కొందరు రహస్యమయిన వేదభాషతో మేఘమును పర్వతముగా చెప్పుచున్నారు. ఆ పర్వతము నుండి గంభీరమయిన ఘోష గలిగి సహింపరాని విద్యుచ్ఛక్తి వ్యక్తమగుచున్నది.
🌺
విశేషవివరము
నిరుక్త నిఘంటువు నందు గల ముప్పది మేఘ నామములలో పర్వతమున్నది.

ఉమాసహస్రం - 1.1.19 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకం, ప్రథమస్తబకం
౧౯వశ్లోకము
🌺
మూలము
సత్యైవ భవతు సేయం కథా తథాపి ప్రభాషితాం భక్తైః ।
తాం మూర్తిమాదిసుదృశో జానీయాత్ కమపి తేజోంశమ్ ॥౧.౧.౧౯॥
🌺
పదవిభాగము
సత్యా ఏవ భవతు సా ఇయం కథా తథా అపి ప్రభాషితాం భక్తైః తాం మూర్తిం ఆదిసుదృశః జానీయాత్ కం అపి  తేజోః అంశమ్ ॥౧.౧.౧౯॥
🌺
అన్వయము
సా ఇయం కథా సత్యా ఏవ భవతు తథా అపి భక్తైః ప్రభాషితాం తాం ఆదిసుదృశః మూర్తిం కమ్ అపి తేజః-అంశం జానీయాత్ ॥౧.౧.౧౯॥
🌺
ప్రతిపదార్థము
సా = ఆ
ఇయం = ఈ
కథా = కథ
సత్యా ఏవ = సత్యమే
భవతు = అగుగాక
తథా అపి = అయినప్పటికీ
భక్తైః = భక్తులచే
ప్రభాషితాం = చెప్పబడిన
తాం = ఆ
ఆదిసుదృశః = ఆద్య స్త్రీ యొక్క
మూర్తిం = విగ్రహమును
కమపి = ఒకానొక
తేజః-అంశం = తేజస్సుయొక్క ఆంశనుగా
జానీయాత్ = తెలిసికొనవలెను
🌺
తాత్పర్యము
పయిన చెప్పబడిన కథ సత్యమే అగుగాక. కానీ భక్తులు వర్ణించిన ప్రథమస్త్రీ స్వరూపమును, ఇట్టిది అని నిర్వచింపలేని ఒకానొక తేజస్సు యొక్క అంశగా తెలిసుకోవలెను.

ఉమాసహస్రం - 1.1.18 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౮వశ్లోకము
🌺
మూలము
కేచన గౌరీం దేవీం శీతాద్రేర్దేవతాత్మనో జాతామ్ ।
కథయన్తి స్త్రియముత్తమలావణ్యాస్వాదితో గణ్యామ్ ॥౧.౧.౧౮॥
🌺
పదవిభాగము
కేచన గౌరీం దేవీం శీతాద్రేః దేవతాత్మనః జాతాం కథయన్తి స్త్రియం ఉత్మ లావణ్యాసు ఆదితః గణ్యామ్ ॥౧.౧.౧౮॥
🌺
అన్వయము
కేచన దేవతాత్మనః శీతాద్రేః జాతాం దేవీం గౌరీం ఉత్తమలావణ్యాసు ఆదితః గణ్యాం స్త్రియం కథయన్తి ॥౧.౧.౧౮॥
🌺
ప్రతిపదార్థము
కేచన = కొందరు
దేవతాత్మనః = దేవతా స్వరూపుడగు
శీతాద్రేః = హిమాచలము నుండి
జాతాం = పుట్టిన
దేవీం = తేజోమయి అయిన
గౌరీం = గౌరిని
ఉత్తమలావణ్యాసు = శ్రేష్ఠమయిన లావణ్యము గల స్త్రీల యందు
ఆదితః = మొదట
గణ్యాం = లెక్కింపదగిన
స్త్రియం = స్త్రీనిగా
కథయన్తి = చెప్పుచున్నారు
🌺
తాత్పర్యము
దేవతా స్వరూపుడగు హిమవత్పర్వతమునకు పుట్టిన తేజోమయి అయిన ఈ గౌరీ దేవిని ఉత్తమ సౌందర్యవతులగు స్త్రీలలో మొదట లెక్కింపదగిన దానినిగా కొందరు చెప్పుదురు.
[హిమాలయము దేవతాత్మయని కాళిదాస మహాకవి కుమారసంభవ కావ్య ప్రారంభమున చెప్పినాడు.]

ఉమాసహస్రం - 1.1.17 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౭వ శ్లోకము
🌺
మూలము
పల్లవమృదు వేదిగతజ్వలనపవిత్రం మహార్ఘమణికాన్తమ్ ।
నవచన్ద్రఖణ్డసౌమ్యం శివసుదృశస్తత్ స్మరామి వపుః ॥౧.౧.౧౭॥
🌺
పదవిభాగం
పల్లవమృదు వేదిగతజ్వలనపవిత్రం, మహార్ఘమణికాన్తం నవచన్ద్రఖణ్డసౌమ్యం శివసుదృశః తత్ స్మరామి వపుః ॥౧.౧.౧౭॥
🌺
అన్వయము
పల్లవమృదు వేదిగతజ్వలనపవిత్రం నవచన్ద్రఖణ్డసౌమ్యం మహార్ఘ మణికాన్తమ్ తత్ శివసుదృశః వపుః స్మరామి ॥౧.౧.౧౭॥
🌺ప్రతిపదార్థము
పల్లవమృదు = చిగురుటాకువలే కోమలమయినదియు
వేదిగతజ్వలనపవిత్రం = యజ్ఞ వేదిక యందలి అగ్ని వలె పవిత్రమయినదియు
నవచన్ద్రఖణ్డసౌమ్యం = నూతనమయిన చంద్రకళ వలె ప్రసన్నమయినదియు అగు
మహార్ఘ = గొప్పదయిన
మణికాన్తమ్ = మణివలె మనోహరమయిన
తత్ = ఆ
శివసుదృశః = శివుని కాంత యొక్క
వపుః = శరీరమును
స్మరామి = తలచుచున్నాను
🌺
తాత్పర్యము
చిగురుటాకు వలె మెత్తనిదయి, యజ్ఞవేదికయందలి అగ్నిహోత్రము వలే పవిత్రమయినదయి గొప్పవిలువ గల మణివలె మనోహరమయినదయి, బాలచంద్రకళవలె ప్రసన్నమయిన శివపత్ని అయిన ఉమ దివ్య దేహమును తలచుచున్నాను.
🌺
విశేషవివరణ
కవి తన యోగబలము వల్లనో స్వాభావిక సామర్థ్యము వల్లనో జన్మాంతరమునందు గానీ లోకాంతరము నందు గానీ తాను చూచిన ఉమాదేవి దివ్య దేహమును స్మరించుచున్నారు.

ఉమాసహస్రం - 1.1.16 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమస్తబకము, ప్రథమశతకము
౧౬వ శ్లోకము
🌺
మూలము
తస్య ప్రథమః సాక్షీ భువనజుషాం నయనశాలినాం మధ్యే ।
వపుషః కిలాదిసుదృశో నిరుపమపుణ్యో నిలిమ్పపతిః ॥౧.౧.౧౬॥
🌺
పదవిభాగము
తస్య ప్రథమః సాక్షీ భువన-జుషాం నయన-శాలినాం మధ్యే వపుషః కిల ఆది-సుదృశః నిరుపమ-పుణ్యః నిలిమ్ప-పతిః ॥౧.౧.౧౬॥
🌺
అన్వయము
భువనజుషాం నయనశాలినాం మధ్యే నిరుపమపుణ్యః నిలిమ్పపతిః ఆది-సుదృశః తస్య వపుషః ప్రథమః సాక్షీ కిల ॥౧.౧.౧౬॥
🌺
ప్రతిపదార్థము
భువనజుషాం = లోకమునందున్న
నయనశాలినాం = నేత్రములు గల వారిలో
మధ్యే = మధ్య
నిరుపమపుణ్యః = సాటిలేని పుణ్యముగలవాడు
నిలిమ్పపతిః = దేవతలకు రాజగు ఇంద్రుడు
ఆది-సుదృశః = ప్రథమ స్త్రీ యొక్క
తస్య = ముందు చెప్పబడిన
వపుషః = శరీరమునకు
ప్రథమః = మొదటి
సాక్షీ = సాక్షి
కిల = అట
🌺
తాత్పర్యము
లోకమునందుగల నేత్రవంతులలో సాటిలేని పుణ్యము గల దేవేంద్రుడే ఆద్య స్త్రీ యగు ఉమాదేవి దివ్య విగ్రహమును దర్శించెను.

ఉమాసహస్రం - 1.1.15 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమస్తబకం, ప్రథమశతకము
౧౫వశ్లోకము
🌺
మూలము
భాసురహేమాభరణాం బహుశోభామీశ్వరప్రమోదకలామ్ ।
మూర్తిం పావనకీర్తిం తాం హైమవతీముమామాహుః ॥౧.౧.౧౫॥
🌺
పదవిభాగము
భాసుర-హేమ-ఆభరణాం బహు-శోభాం ఈశ్వర-ప్రమోద-కలామ్ మూర్తిం పావన-కీర్తిం తాం హైమవతీం ఉమాం ఆహుః ॥౧.౧.౧౫॥
🌺
అన్వయము
భాసురహేమాభరణాం బహుశోభామ్ ఈశ్వరప్రమోదకలాం పావనకీర్తిం మూర్తిం తాం హైమవతీమ్ ఉమామ్ ఆహుః ॥౧.౧.౧౫॥
🌺
ప్రతిపదార్థము
భాసుర-హేమ-ఆభరణాం = ప్రకాశించుచున్న బంగారు అలంకారములు గలదియు
బహు-శోభాం = మిక్కిలి కాంతి కలదియు
ఈశ్వర-ప్రమోద-కలాం = ఈశ్వరుని ఆనందకలయు
మూర్తిం = దేహధారిణియు
పావన-కీర్తిం = నిర్మలమయినకీర్తి కలదియు అగు
తాం = ఆ
హైమవతీం = హైమవతిని
ఉమాం = ఉమనుగా
ఆహు = చెప్పుచున్నారు
🌺
తాత్పర్యము
ప్రకాశించుచున్న బంగారు అలంకారములతో అధికమగు కాంతిని కలిగి ఈశ్వరుని ఆనందకలయై, దేహధారిణియై, నిర్మలకీర్తి కల ఆహైమవతిని ఉమగా చెప్పుచున్నారు.
🌺
విశేషవివరణ
హిమవంతుని కూతురు హైమవతి అనునదే కాక కవి బంగారుమయమగు జ్యోతి అను అర్థమున ఉపనిషత్తులో చెప్పబడిన కథను గుర్తు చేయుచున్నారు.

ఉమాసహస్రం - 1.1.14 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౪ వశ్లోకము
🌺
మూలము
దివ్యపుమాకృతిమీశే బిభ్రతి లీలార్థమస్య రమణాయ ।
దివ్యవనితాకృతిం సా బభార మాతా చ భువనానామ్ ॥౧.౧.౧౪॥
🌺
పదవిభాగము
దివ్య-పుమ్-ఆకృతిం ఈశే బిభ్రతి లీలార్థం అస్య రమణాయ దివ్య-వనితా-ఆకృతిం సా బభార మాతా  చ భువనానామ్ ॥౧.౧.౧౪॥
🌺
అన్వయము
ఈశే లీలార్థం దివ్యపుమాకృతిం బిభ్రతి సతి అస్య రమణాయ సా భువనానాం మాతా చ దివ్యవనితాకృతిం బభార ॥౧.౧.౧౪॥
🌺
ప్రతిపదార్థము
ఈశే = పరమపురుషుడగు ఈశ్వరుడు
లీలార్థం = లీల కొఱకు
దివ్య-పుమ్-ఆకృతిం = దివ్యమైన పురుష రూపమును
బిభ్రతి సతి = ధరించినవాడు కాగా
అస్య = ఆ ఈశ్వరుని యొక్క
రమణాయ = క్రీడ కొఱకు
సా = ఆ
భువనానాం మాతా చ = జగజ్జనని కూడ
దివ్య-వనితా-ఆకృతిం = దివ్యస్త్రీ రూపమును
బభార = ధరించెను
🌺
తాత్పర్యము
పరమేశ్వరుడు విలాసార్థమై దివ్యపురుషాకృతిని ధరించగా, ఆయనను ఆనందింపచేయుటకై, ఆ జగజ్జనని కూడ దివ్యస్త్రీ రూపమును ధరించెను.
🌺
విశేషవివరణ
దివ్యశబ్దమునకు, చర్మచక్షువులకు గోచరించని, భావనకందని, తేజోమయమని అర్థముకాగా జగన్మాత, ఈశ్వరుడు ధరించిన రూపములు తేజోమయములని అర్థము.

ఉమాసహస్రం - 1.1.13 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౩వ శ్లోకము
🌺
మూలము
జగతాం మాతాపితరౌ సతీభవౌ కేఽపి పణ్డితాః ప్రాహుః ।
అదితిప్రజాపతీ తావపరేషాం భాషయా విదుషామ్ ॥౧.౧.౧౩॥
🌺
పదవిభాగము
జగతాం మాతాపితరౌ సతీభవౌ కే అపి పణ్డితాః ప్రాహుః అదితిప్రజాపతీ తౌ అపరేషాం భాషయా విదుషామ్ ॥౧.౧.౧౩॥
🌺
అన్వయము
జగతాం మాతాపితరౌ సతీభవౌ కేఽపి పణ్డితాః ప్రాహుః తౌ అపరేషాం విదుషాం భాషయా అదితిప్రజాపతీ భవతః ॥౧.౧.౧౩॥
🌺
ప్రతిపదార్థము
జగతాం = లోకములకు
మాతాపితరౌ = తల్లిదండ్రులు
సతీభవౌ = దాక్షాయణీ శివులు అని
కేఽపి = కొందరు
పణ్డితాః = పండితులు
ప్రాహుః = చెప్పుచున్నారు
తౌ = ఆ జగజ్జననీ జనకులు
అపరేషామ్ = మరి కొందరు
విదుషాం = విద్వాంసుల యొక్క
భాషయా = భాషతో
అదితిప్రజాపతీ = దేవమాత యగు అదితి, ప్రజాపతియగు కశ్యపుడు
భవతః = అగుచున్నారు
🌺
తాత్పర్యము
జగములకు జననీ జనకులు దాక్షాయణీ శివులని కొందరు పండితులు చెప్పగా, మరికొందరు విద్వాంసులు, ఆ జగజ్జననీ జనకులు అదితి కశ్యపులని అనుచున్నారు. ఇది పురాణ మతము.

ఉమాసహస్రం - 1.1.12 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౨ వశ్లోకము
🌺
మూలము
ఆకాశస్య సుతైవం లక్షణయా వస్తుతః ప్రసూః శక్తిః ।
అదితేర్దక్షో దక్షాదదితిరితి శ్రుతిరబాధైవం ॥౧.౧.౧౨॥
🌺
పదవిభాగము
ఆకాశస్య సుతా ఏవం లక్షణయా వస్తుతః ప్రసూః శక్తిః అదితేః దక్షః దక్షాత్ అదితిః ఇతి శ్రుతిః అబాధా ఏవమ్ ॥౧.౧.౧౨॥
🌺
అన్వయం
వస్తుతః ప్రసూః శక్తిః ఏవం లక్షణయా ఆకాశస్య సుతా భవతి ఏవం అదితేః దక్షః జాతః దక్షాత్ అదితిః జాతా ఇతి శృతిః అబాధా భవతి ॥౧.౧.౧౨॥
🌺
ప్రతిపదార్థము
వస్తుతః = యథార్థముగా
ప్రసూః = జనని- దక్షరూపమగు ఆకాశమునకు గూడ జనని అయిన
శక్తిః = శక్తి
ఏవం = ఈ విధముగా
లక్షణయా = లక్షణావృత్తి చేత
ఆకాశస్య = ఆకాశమునకు
సుతా = పుత్రి
భవతి = అగుచున్నది
ఏవం = ఈ ప్రకారముగా
అదితేః = అదితి నుండి
దక్షః = దక్షుడు
జాతః = పుట్టినాడు
దక్షాత్ = దక్షుని నుండి
అదితిః = అదితి
జాతా = పుట్టినది
ఇతి = అనెడు
శృతిః = వేదము
అబాధా = అవిరుద్ధము
భవతి = అగుచున్నది
🌺
తాత్పర్యము
యథార్థముగా దక్షరూపమగు ఆకాశమునకుసైతము జనని యగుశక్తి లక్షణావృత్తి చేత ఆకాశమునకు పుత్రియగును. ఆ విధముగా అదితి నుండి దక్షుడు, దక్షుని నుండి అదితి జన్మించెనను వేదవచనము నిర్బాధమగుచున్నది.
🌺
విశేషవివరణ
లక్షణావృత్తి యనగా లక్షణయను శబ్దవ్యాపారము వాచ్యార్ధము, ముఖ్యార్థము కుదరనపుడు లక్షణయను శబ్ద వ్యాపారము గ్రహించబడును. లక్షణచే తెలుపబడు, అర్థము లక్ష్యార్థము అగును. ప్రస్తుతము జనని అయిన శక్తికి లక్ష్యార్థము సుత- పుత్రికయగును.

Friday, September 14, 2018

ఉమాసహస్రం - 1.1.11 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౧వ శ్లోకము
🌺
మూలము
సత్యాః ప్రాగపి శక్తేః ప్రాదుర్భావః స కీర్త్యతే ప్రథమః । 
ఈశాభిమానమయ్యాః పృథగభిమానిత్వనిష్పత్త్యా ॥౧.౧.౧౧॥
 
🌺
పదవిభాగము
సత్యాః ప్రాక్ అపి శక్తేః ప్రాదుర్భావః సః కీర్త్యతే ప్రథమః ఈశ-అభిమానమయ్యాః పృథగ్-అభిమానిత్వ-నిష్పత్త్యా ॥౧.౧.౧౧॥
 
🌺
అన్వయము
ఈశాభిమానమయ్యాః ప్రాగ్ అపి సత్యాః శక్తేః పృథగ్ అభిమానిత్వనిష్పత్త్యా సః ప్రథమః ప్రాదుర్భావః కీర్త్యతే ॥౧.౧.౧౧॥
 
🌺
ప్రతిపదార్థము
ఈశ-అభిమానమయ్యాః = పరమ పురుషుడగు ఈశ్వరుని అభిమాన రూపిణియై
ప్రాగ్ అపి = ముందు గూడ, (దక్షుడను వేఱయిన ఆత్మ ప్రకాశించుటకు ముందు గూడ)
సత్యాః = ఉన్నదగు
శక్తేః = శక్తికి
పృథగ్ అభిమానిత్వ-నిష్పత్త్యా = వేఱయిన ఆత్మగా వ్యక్తనయితినన్న అభిమానము కలుగుటచే
సః = అది
ప్రథమః = మొదటిదయిన
ప్రాదుర్భావః = ఆవిర్భావముగా
కీర్త్యతే = కీర్తించబడుతున్నది
 
🌺
తాత్పర్యము
పరమేశ్వరుని అభిమాన రూపిణియగు శక్తి దక్షాత్మ ప్రకాశమునకు ముందు కూడ ఉన్నది. కానీ వేరు ఆత్మగా వ్యక్తనయితినన్న అభిమానము కలుగుట వల్ల అది మొదటి ఆవిర్భావముగా చెప్పబడుచున్నది.
 
🌺
విశేషవివరణ
ఈశ్వరాభిమానరూపిణియగు శక్తి అజ- అనగా జన్మ లేనిది. ఈ విషయము సత్యాః అను పదముచే సూచించబడుచున్నది. ఈకారాన్తమయిన సతీ శబ్దమునకు సర్వదా ఉండునది అని అర్థము. అందువలన దాక్షాయణిని సతీ అని పురాణములు పేర్కొన్నవి.

ఉమాసహస్రం - 1.1.10 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౦వ శ్లోకము
🌺
మూలము
దక్షః పరోక్షముదితః పన్థా ఏష త్విషాం జనో లోకః ।
తద్గర్భే లబ్ధాత్మా కథితా దాక్షాయణీ శక్తిః ॥౧.౧.౧౦॥
 
🌺
పదవిభాగము
దక్షః పరోక్షమ్ ఉదితః పన్థాః ఏషః త్విషాం జనః లోకః తద్గర్భే లబ్ధాత్మా కథితా దాక్షాయణీ శక్తిః ॥౧.౧.౧౦॥
 
🌺
అన్వయము
త్విషాం పన్థాః ఏషః జనో లోకః దక్షః పరోక్షమ్ ఉదితః తద్గర్భే లబ్ధాత్మా శక్తిః దాక్షాయణీ కథితా ॥౧.౧.౧౦॥
 
🌺ప్రతిపదార్ధము
త్విషాం = కాంతుల యొక్క
పన్థాః = మార్గమయిన
ఏషః = ఈ
జనో లోకః = జనలోకము
దక్షః = దక్షుడని
పరోక్షం = పరోక్షముగా
ఉదితః = చెప్పబడినాడు
తద్గర్భే = అతని గర్భము నందు
లబ్ధాత్మా = పొందబడిన రూపము గల
శక్తిః = శక్తి
దాక్షాయణీ = దాక్షాయణి దక్షుని పుత్రికగా
కథితా = చెప్పబడినది
 
🌺
తాత్పర్యము
కాంతిమార్గము- జ్వలితాకాశ రూపము అయిన ఈ జన లోకము, దక్షుడని గూఢ భావముతో చెప్పబడినది. ఆ దక్షుని గర్భమున జనించిన శక్తి దాక్షాయణిగా చెప్పబడినది.
 
🌺
విశేషవివరణ
వేదమంత్రములు, గూఢభాషతో తత్వములను చెప్పును. ఎట్లనగా పరోక్ష ప్రియా దేవాః .అని వేద వచనము. అనగా దేవతలు పరోక్ష వచనముల యందు ప్రీతి కలవారు అని అర్థము. జ్వలితాకాశము దక్షుడయ్యెననుటకు ప్రమాణము- అదితేర్దక్షో అజాయత. దక్షాద్వదితిః పరి- అని వేదవచనము. అనగా అదితి నుండి దక్షుడు జనించెను. దక్షుని నుండి అదితి జనించెను- అని భావము.

ఉమాసహస్రం - 1.1.9 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రం🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౯వ శ్లోకము
🌺
మూలము
ప్రాన్తేషు కోఽపి శక్తేః పృథగాత్మా వియదుపాధిసఙ్గేన ।
పరమాత్మనో విభక్తః  స్వయమభిమన్తా వినిష్పేదే ॥౧.౧.౯॥

🌺
పదవిభాగము
ప్రాన్తేషు కః అపి శక్తేః పృథగ్-ఆత్మా వియద్-ఉపాధి-సఙ్గేన పరమాత్మనః విభక్తః స్వయమ్ అభిమన్తా వినిష్పేదే ॥౧.౧.౯॥

🌺
అన్వయము
శక్తేః ప్రాన్తేషు వియదుపాధిసఙ్గేన కః అపి పృథగాత్మా పరమాత్మనః విభక్తః, స్వయం అభిమన్తా వినిష్పేదే ॥౧.౧.౯॥

🌺
ప్రతిపదార్ధము
శక్తేః = ఇంతకుముందు చెప్పబడిన శక్తి యొక్క
ప్రాన్తేషు = పరిసరముల యందు
వియద్-ఉపాధి-సఙ్గేన = జనలోక ఆకాశ ఉపాధి సఙ్గము చేత
కః అపి = ఒకానొక
పృథగాత్మా = వేరయిన ఆత్మ
పరమాత్మనః = పరమాత్మ నుండి
విభక్తః, = వేరు చేయబడినవాడై
స్వయం = స్వయముగా
అభిమన్తా = అభిమానించువాడు
వినిష్పేదే = జన్మించెను

🌺
తాత్పర్యము
పైన పేర్కొన బడిన జ్వాలారూప శక్తి తీరములందు, తపోలోక జనలోక సంధి ప్రదేశములయందు, జనలోకమనెడి ఆకాశపు ఉపాధి సంపర్కమువలన ఇట్టివాడని నిశ్చయింప వీలుగాని, అవ్యక్తుడయి, పరమ పురుషునికంటే వేరుగా అభివ్యక్తుడయిన స్వాభిమానము గల వ్యక్తి జన్మించెను.

🌺
విశేషవివరణ
పరమపురుషుడే పరమాత్మ ఆయన సర్వమునకు మూల పురుషుడు. ఆయన అవ్యక్త సత్యస్వరూపుడు. ఆయన నుండి వ్యక్తమయిన ఆత్మశక్తి ప్రాంతములందు, ఆకాశోపాధి సంబంధము వలన స్వాభిమానము గల్గి సృష్టికి అద్యక్షుడుగా ఆవిర్భవించెనని భావము.

ఉమాసహస్రం - 1.1.8 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౮వశ్లోకము
🌺
మూలము
ఉద్గీర్ణధూమకల్పో యోఽయమపారో మహాన్ జనో లోకః ।
వ్యోమాన్తరిక్షగగనప్రభృతిభిరభిదాభిరాహుస్తమ్ ॥౧.౧.౮॥
 
🌺
పదవిభాగము
ఉద్గీర్ణధూమకల్పః యః అయం అపారః మహాన్ జనః లోకః వ్యోమ అంతరిక్ష గగన ప్రభృ- తిభిః అభిదాభిః ఆహుః తమ్ ॥౧.౧.౮॥
🌺
అన్వయము
ఉద్గీర్ణధూమకల్పః యః జనః లోకః అయం అపారః మహాన్ తం వ్యోమ-అన్తరిక్ష-గగన-ప్రభృతిభిః అభిదాభిః ఆహుః ॥౧.౧.౮॥
 
🌺
 ప్రతిపదార్థము
ఉద్గీర్ణ-ధూమ-కల్పః = బయటకు వచ్చినపొగవంటి,
యః = ఏ
జనః లోకః = జనలోకము ఉన్నదో
అయం = ఆ ఈ జనలోకము
అపారః = అవధులు లేనిది
మహాన్ = విస్తృతమయినది
తం = ఆ జనలోకమును
వ్యోమ-అన్తరిక్ష-గగన-ప్రభృతిభిః = వ్యోమము, అంతరిక్షము, గగనము మొదలగు
అభిదాభిః = పేర్లతో
ఆహుః = చెప్పుచున్నారు

🌺
తాత్పర్యము
బయల్వెడలిన ఈ జనలోకము అవధులు లేనిది. ఆ జనలోకమును వ్యోమము, అంతరిక్షము, గగనము, అను పేర్లతో పిలుచుచున్నారు.

🌺విశేషవివరణము
పై శ్లోకమునందు, జనలోకము ఉపాధిగా గల శక్తి పరమ వ్యోమమని చెప్పబడినది. ఈ శ్లోకమున జనలోకము వ్యోమమని చెప్పబడినది. 'వ్యోమ' పదవాచ్యమయిన జనలోకమునకు, పరమవ్యోమ పద వాచ్యమయిన శక్తికి గల బేధమిది. వ్యోమమనబడు జనలోకమున శక్తిప్రకాశము గూఢము శుద్ధజ్వాలా రూపమగు పరమ వ్యోమమున శక్తి ప్రకాశము స్పష్టముగానుండును.

ఉమాసహస్రం - 1.1.7 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౭వ శ్లోకము
🌺
మూలము
ధూమాన్తరోష్మకల్పా శుద్ధజ్వాలోపమా చ యా శక్తిః ।
తాం దివమాహుః కేచన పరమం వ్యోమాపరే ప్రాహుః ॥౧.౧.౭॥

🌺
పదవిభాగము
ధూమాంతరోష్మకల్పా శుద్ధజ్వాలోపమా చ యా శక్తిః తాం దివం ఆహుః కేచన పరమం వ్యోమ అపరే ప్రాహుః ॥౧.౧.౭॥

🌺
అన్వయము
ధూమాన్తరోష్మకల్పా చ శుద్ధజ్వాలోపమా యా శక్తిః అస్తి తాం కేచన దివమ్ ఆహుః అపరే పరమం వ్యోమ ప్రాహుః ॥౧.౧.౭॥

🌺
ప్రతిపదార్థము
ధూమాన్తరోష్మకల్పా = పొగ మధ్యనున్న, వేడిమితో సమానమయిన
చ = మరియు
శుద్ధజ్వాలోపమా = శుద్ధమయిన జ్వాలతో పోలిక గల
యా = ఏ
శక్తిః = శక్తి
అస్తి = ఉన్నదో
తాం = ఆ శక్తిని
కేచన = కొందరు
దివం = స్వర్గమని
ఆహుః = చెప్పుచున్నారు
అపరే = మరి కొందరు
పరమం = పరమమయిన
వ్యోమ = ఆకాశమని
ప్రాహుః = చెప్పుచున్నారు

🌺
తాత్పర్యము
పొగమధ్యనున్న వేడిమి వంటి శుద్ధ జ్వాలా తుల్యమయిన శక్తి స్వర్గమని కొందరనగా మరి కొందరు పరమాకాశమని చెప్పుదురు.

🌺
విశేషవివరణ
సృష్టికి ఉపాదానకారణములయిన ద్రవ్యములతో గూడి జనలోకమను పేరుతో పరమపురుషుని నుండి వెలువడు పదార్థజాలము స్వర్గమని కొందరందురు. ఆ పదార్థజాలమందున్న జ్వాలా తుల్యమయిన శక్తి స్వర్గమని మరికొందరు చెప్పుచున్నారు. ఆ శక్తి పరమాకాశమని కొందరు భావించుచున్నారు.

ఉమాసహస్రం - 1.1.6 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౬వశ్లోకము
🌺
మూలము
అతిసూక్ష్మధూమకల్పం లోకం తతమాఖ్యయాన్యయా నాకమ్ ।
ఏవం తతోఽపి సూక్ష్మా వ్యాప్తాన్తరతః పరా శక్తిః ॥౧.౧.౬॥
 
🌺
పదవిభాగం
అతిసూక్ష్మధూమకల్పం లోకం తతం ఆఖ్యయా అన్యయా నాకం ఏతం తతః అపి సూక్ష్మా వ్యాప్తా అన్తరతః పరా శక్తిః ॥౧.౧.౬॥
 
🌺
అన్వయం
అతిసూక్ష్మధూమకల్పం అన్యయా ఆఖ్యయా నాకం తతమ్. ఏతం లోకం తతః అపి పరా శక్తిః అన్తరతః వ్యాప్తా ॥౧.౧.౬॥

🌺
ప్రతిపదార్థము
అతిసూక్ష్మధూమకల్పం = అత్యంత సూక్ష్మమయిన పొగతో సమానమయినదియు,
అన్యయా = వేరయిన
ఆఖ్యయా = పేరుతో
నాకం = స్వర్గమని
తతం = ప్రసిద్ధమయిన
ఏతం = ఈ
లోకం = జనలోకమును
తతః అపి = దానికంటెను సూక్ష్మమయిన
పరా = పరమమయిన
శక్తిః = శక్తి
అన్తరతః = లోపల
వ్యాప్తా = వ్యాపించినదై యున్నది
 
🌺
తాత్పర్యము
పొగవంటి జనలోకము కంటెను, మిక్కిలి సూక్ష్మమయిన పరమశక్తి, ఆ జనలోకములోపల నుండి
ఆ జనలోకమునంతటిని వ్యాపించియున్నది.
 
🌺విశేషవివరణ
జనలోకమునకు నాకము-స్వర్గము-(దుఃఖములేనిది) అనిపేరు.

ఉమాసహస్రం - 1.1.5 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౫వ శ్లోకము
🌺
మూలము
అన్తర్గూఢార్థానాం పురుషాగ్నేర్ధూమకల్ప ఉద్గారః ।
శక్తిజ్వాలాః పరితః ప్రాన్తేష్వభవజ్జనో లోకః ॥౧.౧.౫॥
 
🌺
పదవిభాగం
అంతర్గూఢార్థానాం పురుషాగ్నేః ధూమకల్పః ఉద్గారః శక్తి జ్వాలాః పరితః ప్రాన్తేషు అభవత్ జనః లోకః ॥౧.౧.౫॥
 
🌺
అన్వయము
పురుషాగ్నేః ధూమకల్పః అన్తర్గూఢార్థానాం ఉద్గారః శక్తిజ్వాలాపరితః ప్రాన్తేషు జనో లోకః అభవత్ ॥౧.౧.౫॥
 
🌺
ప్రతిపదార్థము
పురుషాగ్నేః = పురుషుడను అగ్ని నుండి
ధూమకల్పః = పొగతో సమానమయిన
అన్తర్గూఢార్థానాం = పరమపురుషుని లోపల అస్పష్టమయిన పదార్థముల యొక్క
ఉద్గారః = ఆవిర్భావము
శక్తిజ్వాలాపరితః ప్రాన్తేషు = పరమపురుషుని తపోమయ శక్తిజ్వాలల చుట్టు ప్రాంతముల యందు
జనో లోకః = జనోలోకము
అభవత్ = అయినది
 
🌺
తాత్పర్యము
పరమ పురుషుడను అగ్ని నుండి వెలువడిన, పరమపురుషాంతర్గతములయిన అస్పష్టములయిన పదార్థముల ఆవిర్భావము, ఆ పరమపురుషుని తపోమయ జ్వాలల చుట్లుపట్ల ప్రాంతమందు వ్యాపించి జనో లోకమని చెప్పబడుచున్నది.
 
🌺
విశేషవివరణ
    అగ్ని నుండి వెలువడిన పొగాగ్ని జ్వాలలనంతటిని ఆవరించును. అట్లే సత్యస్వరూపుడయిన
పరమ పురుషుని నుండి వ్యక్తము కాబోవు గూఢార్థములు వెలువడి ఆయన శక్తితరంగముల చుట్టు వ్యాపించుచున్నవి. దీనికే జనోలోకమని పేరు.
    గూఢార్థములనగా- అవ్యక్తావస్థలో నుండి పుట్టిన, పుట్టుచున్న, పుట్టబోవుచున్న నానా విధ జగజ్జీవనోపాధులకు ఉపాదాన కారణములగుచు పరమ పురుషుని నుండి ఆవిష్కరించబడు పదార్థములని భావము.

ఉమాసహస్రం - 1.1.4 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౪వ శ్లోకము
🌺
మూలము
పరమః పురుషో నాభిర్లోకానాం సత్య ఉచ్యతే లోకః ।
పరితస్తతః సరన్తీ సూక్ష్మా శక్తిస్తపో లోకః ॥౧.౧.౪॥

🌺
పదవిభాగము
పరమః పురుషః నాభిః లోకానాం సత్యః ఉచ్యతే లోకః పరితః తతః సరన్తీ సూక్ష్మా శక్తిః తపోలోకః ॥౧.౧.౪॥

🌺
అన్వయము
పరమః పురుషః లోకానాం నాభిః సత్యలోకః ఉచ్యతే తతః పరితః సరన్తీ సూక్ష్మా శక్తిః తపోలోకః ఉచ్యతే ॥౧.౧.౪॥

🌺
ప్రతిపదార్థము
పరమః = సర్వోత్తముడయిన
పురుషః = పురుషుడు
లోకానాం = లోకములకు
నాభిః = కేంద్రము అయిన
సత్యలోకః = సత్య లోకముగా
ఉచ్యతే = చెప్పబడుచున్నాడు
తతః పరితః = ఆయన చుట్టు
సరన్తీ = వ్యాపించుచున్న
సూక్ష్మా = సూక్ష్మమగు
శక్తిః = శక్తి
తపోలోకః = తపోలోకమని
ఉచ్యతే = చెప్పబడుతున్నది

🌺
తాత్పర్యము
పూర్వశ్లోకమున చెప్పబడ్డ పరమపురుషుడే సకల లోకములకు కేంద్ర స్థానమయిన సత్యలోకమని చెప్పబడుచున్నాడు. ఆయన చుట్టు వ్యాపించియున్న సూక్ష్మశక్తి తపోలోకమని చెప్పబడుచున్నది.

🌺
విశేషవివరణ
రథచక్రపు మధ్యభాగమును ఆశ్రయించి, ఆకులన్నియు ఉన్నట్లుగా పరమ పురుష రూపమయిన సత్యలోకమునందు సర్వలోకములు నెలకొని యున్నవి. ప్రాణినుండి ప్రాణమును వేరు చేయలేనట్లు పరమ పురుషుని నుండి వేరుగాని ఆయన సహజసూక్ష్మశక్తి యున్నది.

ఉమాసహస్రం - 1.1.3 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
 ప్రథమశతకము, ప్రథమస్తబకము
౩వ శ్లోకము
🌺
మూలము
సాతత్త్వతః సమన్తాత్ సత్యస్య విభోస్తతా తపశ్శక్తిః ।
లీలామహిలావపుషా హైమవతీతనుషు కుణ్డలినీ ॥౧.౧.౩॥

🌺
 పదవిభాగము
సా తత్త్వతః సమన్తాత్ సత్యస్య విభోః తతా తపశ్శక్తిః లీలామహిలావపుషా హైమవతీ తనుషు కుణ్డలినీ ॥౧.౧.౩॥

🌺
 అన్వయము
సా తత్త్వతః సత్యస్య విభోః సమన్తాత్ వ్యాప్తా తపశ్శక్తిః భవతి లీలా-మహిలా-వపుషా హైమవతీ భవతి తనుషు కుణ్డలినీ భవతి ॥౧.౧.౩॥

🌺
 ప్రతిపదార్థము
సా = ఆ మహాశక్తి
తత్త్వతః = విచారదృష్టితో పరిశీలించుట వలన
సత్యస్య = సత్య స్వరూపుడగు
విభోః = సర్వవ్యాపకుడగు ఈశ్వరుని యొక్క
సమన్తాత్ = చుట్టును, అంతట
వ్యాప్తా = వ్యాపించిన
తపశ్శక్తిః = తపశ్శక్తి
భవతి = అగుచున్నది
లీలా-మహిలా-వపుషా = లీలార్థమయిన స్త్రీశరీరముచే
హైమవతీ = హిమవంతునిపుత్రి, పార్వతి
భవతి = అగుచున్నది
తనుషు = మానవులమయిన మన శరీరములయందు
కుణ్డలినీ = కుణ్డలినీ శక్తి
భవతి = అగుచున్నది

🌺
తాత్పర్యము
ఆ మహాశక్తి విచార దృష్టితో పరిశీలించినచో సత్యస్వరూపుడయిన సర్వవ్యాపకుడగు పరమేశ్వరుని చుట్టును వ్యాపించియున్న తపశ్శక్తియే, ఆమెయే లీలాస్త్రీ రూపధారిణియై హైమవతి లేదా పార్వతి అయినది.

🌺
విశేషవివరణ
ఈ శ్లోకమునందు మహాశక్తి మూడు విధములుగా నున్నదని చెప్పబడినది.
    ౧. సూర్యునకు కాంతివలే, అద్వితీయ సత్యస్వరూపుడగు పరమేశ్వరుని సహజసిద్ధమయిన సర్వవ్యాపిని యగు తపశ్శక్తి మహాశక్తికి మొదటి రూపము
    ౨. లోకానుగ్రహార్థము స్వీకరించిన పార్వతీరూపము రెండవది
    ౩. యోగులచే తెలియబడి తంత్ర శాస్త్ర ప్రసిద్ధమై సర్వదేహములందు ఉండు కుండలిని మూడవది.

Thursday, September 13, 2018

ఉమాసహస్రం - 1.1.2 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౨వ శ్లోకము
🌺
 మూలము
నిఖిలేషు ప్రవహన్తీం నిరుపాధివిమర్శయోగదృశ్యోర్మిమ్ ।
అజరామజామమేయాం కామపి వన్దే మహాశక్తిమ్ ॥౧.౧.౨॥

🌺
 పదవిభాగము
నిఖిలేషు ప్రవహన్తీమ్ నిరుపాధివిమర్శయోగదృశ్యోర్మిం అజరాం అజాం అమేయాం కామ్ అపి వన్దే మహాశక్తిం ॥౧.౧.౨॥

🌺
 అన్వయము
నిఖిలేషు ప్రవహన్తీం నిరుపాధివిమర్శయోగదృశ్యోర్మిం అజరాం అజాం అమేయాం కామ్ అపి మహాశక్తిం వన్దే ॥౧.౧.౨॥

🌺
 ప్రతిపదార్థము
నిఖిలేషు = అన్నిటియందు, ఇహలోక పరలోకముల యందు గల సమస్త వస్తువుల యందు
ప్రవహన్తీం = నిరంతరము ప్రవహించుచున్నదియు
నిరుపాధి-విమర్శ-యోగ-దృశ్యోర్మిం = దేశ, కాల, వస్తుకృత బేధము లేని ఆలోచనా రూపమగు యోగమునందు దర్శింపదగు తరంగములు గలిగినది
అజరాం = ముసలితనము లేనిదియు
అజాం = పుట్టుక లేనిదియు
అమేయాం = కొలుచుటకు వీలుకానిదియు
కామ్ అపి = ఒకానొక, ఇట్టిదని చెప్పుటకు వీలుగాని
మహా-శక్తిం = గొప్పశక్తిని
వన్దే = నమస్కరించుచున్నాను

🌺
 తాత్పర్యము
సృష్టిలోని సమస్త వస్తువులయందును ఎడతెగక ప్రవహించుచు దేశ కాల వస్తు కృత పరిమితులు లేని ఆలోచన గల యోగమునందు దర్శింపదగిన తరంగములు గలిగి, ముసలితనము, పుట్టుక, కొలత, లేని ఇట్టిదని వివరింపరాని మహాశక్తికి నమస్కరించుచున్నాను.

ఉమాసహస్రం - 1.1.1 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧వ శ్లోకము
🌺 
మూలము
అఖిలజగన్మాతోమా తమసా తాపేన చాకులానస్మాన్ ।
అనుగృహ్ణాత్వనుకమ్పాసుధార్ద్రయా హసితచన్ద్రికయా ॥౧.౧.౧॥

🌺
 పదవిభాగము
అఖిలజగన్మాతా ఉమా తమసా తాపేన చ ఆకులాన్ అస్మాన్ అనుగ్రుహ్ణాతు అనుకమ్పా-సుధార్ద్రయా హసితచంద్రికయా ॥౧.౧.౧॥

🌺
 అన్వయము
అఖిలజగన్మాతా ఉమా తమసా తాపేన చ ఆకులాన్ అస్మాన్ అనుకమ్పాసుధార్ద్రయా హసితచన్ద్రికయా అనుగృహ్ణాతు ॥౧.౧.౧॥

🌺
 ప్రతిపదార్థము
అఖిల-జగన్మాతా = సకలజగములకుతల్లియగు
ఉమా = ఉమాదేవి
తమసా = చీకటిచేత-అజ్ఞానము చేత
తాపేన చ = త్రివిధమయిన తాపముచేత
ఆకులాన్ = పీడింపబడ్డ
అస్మాన్ = మమ్ములను
అనుకమ్పా-సుధా-ఆర్ద్రయా = దయామృతముతో తడిసిన
హసిత-చన్ద్రికయా = నవ్వు అనెడి వెన్నెలతో
అనుగృహ్ణాతు = అనుగ్రహించుగాక

🌺
 తాత్పర్యము
సర్వలోకములకు తల్లియగు ఉమాదేవి చీకటి చేతను, అజ్ఞానము చేతను, అధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికములు అనబడు మూడు తాపముల చేతను పీడింపబడిన మమ్ములను దయామృతముతో చల్లబడిన నవ్వు వెన్నెలతో అనుగ్రహించుగాక.

పరిచయం

సంస్కృతాన్ని దైవీవాక్ అంటారు. అంటే దేవతలు మాట్లాదేదని కాదు, మనం ఆమెను పలికితే దేవతలలా అయిపోతామని అర్థం. అటువంటిది ఆ భాషలో దేవత గురించిన కావ్యాలింకా ఎంత మధురాలో, ఎంత దివ్యాలో మాటలలో చెప్పగలగే నాథుడు లేడు. అవి అనుభవించి తీరవలసినవి. పరతత్త్వాన్ని ఏ కొందరో అదృష్టవంతులు, తపస్వులు, ప్రయత్నశీలురైన ధీరులు ఆవిష్కరించుకోగలిగారు. 

     వారు మిగితా సామాన్య విశేష సాధకుల కోసం ఆ తత్త్వాన్ని శాస్త్రాలుగా, కావ్యాలుగా, తంత్రాలుగా, ఆగమాలుగా, విశేషపద్ధతులలో ఎన్నో విధాలుగా ప్రకటించారు. సౌలభ్యం కోసం మరి కొందరు మహాత్ములు వాటికి వ్యాఖ్యలు, అనువాదాలు, వివరణలు వ్రాసి మనకు మరింత చేరువ చేశారు. వాటిని సామాన్యంగా చదివినా, విశేషంగా అధ్యయనం దృష్టితో పఠించినా, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా, లేదా సత్కాలక్షేపం అనుకుని ఆ అక్షరాలపై కళ్ళాడిస్తూ సమయం గడిపినా ఎంతో కొంత పుణ్యలాభం, అంతర్దృష్టిలో వికాసం, లోపలి ప్రపంచంలో మంచి మార్పు, దివ్యదిశగా ఏదో ఒక కదలిక అనుభూతి కావటం వారి వారి స్థాయిని బట్టి అనుభవించినవారికి ఎరుక. అప్పుడు కలిగే దివ్యానందం అనుభవైకవేద్యం. ఏమీ అంటకపోయినా కొద్ది దురితాల ప్రక్షాలనం కోసమైనా వీటి పఠనం లాభం చేకూరుస్తుంది.

     ప్రాచీన భారతీయ సనాతన సత్పథంలో ఇట్టి ప్రయత్నాలెన్నో జరిగాయి. వాటిలో పరతత్వాన్ని దేవీరూపంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం ఒకటి ఈ ఉమాసహస్రం. ఇది పరిచయం తో పని లేని మహాత్ములు శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారి రచన. దీనికి పన్నాల రాధాకృష్ణ శర్మ గారు వ్యాఖ్య వ్రాసి మనకెంతో ఉపకారం చేశారు. ఎంతో దయతో రమణాశ్రమం వారు మనకోసం ప్రచురించారు. 

https://www.eganesha.in/product/uma-sahasram-telugu/

Type: Paperback
SKU: RAM T 008
Publication Year: 2013 3rd Edition
Author: Pannala Radhakrishna Sharma
ISBN: 9788182880511
       ఇక ఆ పుస్తకాన్ని తమ కుమారుడు ఉపహారంగా ఇస్తే అది చూసి, లేదా తన స్వలాభం కోసం చదివి ఊరుకోకుండా దాన్ని మనకు టంకిత రూపంలో అందించినవారు సహృదయురాలు మాన్య శ్రీమతి శివకామసుందరిగారు. మా సంస్కృతసంస్కృతీ (వాట్సాప్) సదస్సులో ఆమె ఈ టంకణం పనిని ఒక సాధనలో భాగంగా, నిరంతరం చేస్తూన్నారు. మరొకరికి లాభం కలిగిందా లేదా అని కాకుండా తనలో వచ్చే ఒక సన్మార్పు కోసం ఓ దివ్యోద్యమంగా ఈ పనిని చేస్తున్న ఈ తపస్వినికి నమస్సులు. ఎట్లైనా మల్లెలు పంచితే ఆ సుగంధం మన చేతికి అందకుండా ఉంటుందా? మనకందిస్తూ ఆమెకు, ఆమె చేత అందుకుంటూ మనకూ కూడా లాభమే కదా. 

      వారి శ్రమ వృథా పోకుండా ఈ కృతిని పంపినది పంపినట్టు భద్రపరిచి బ్లాగు చేద్దామని నిర్ణయించింది ఇంకా ఎందరో తెలుగువారికి నెట్ ద్వారా ఉపకారం జరగాలని. దీనిని సామాన్యంగా చదివేవారికి ఏ విధానాలతో పని లేదు. సంస్కృతార్థులకోసం మాత్రం కొన్ని సూచనలు ఈ క్రింద ఇవ్వటమైనది-

సంస్కృతం శ్లోకం తో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేసే విధానం-


సంస్కృతం శ్లోకం తో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేసే విధానం-
1.       మొదలు మూల శ్లోకం, తరువాత అదే క్రమంలో మిగిలినదంతా పదవిభాగాదులను చదవటం.
2.       పూర్తి అయినాక మళ్ళీ విరుద్ధ దిశగా కిందనుండి పైకి చదివటం. అంటే తెలుగు అనువాదం, ప్రతిపదార్థం, అన్వయం అట్లా.
3.       తరువాత అనువాదంలోని ఫలానా తెలుగు పదం మూలంలో ఎక్కడున్నది- అని ఊహిస్తూ మూలంలోనైనా పదవిభాగంలోనైనా చూసుకోవటం.
4.       సంస్కృతవాక్యం అన్వయక్రమం ప్రకారం తెలుగు అనువాదాన్ని సరిపోల్చుకోవటం. అది ఒకసారి ఇది ఒకసారి చదవటం.
5.       సంధులను పదవిభాగంలోనే శ్లోకాధ్యయనం చివరలో సంధుల దృష్టితో మరోసారి చదవటం మంచిది. (పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, ఈ స్థాయిలో పదాన్ని విడదీసే విధానం తెలిస్తే చాలు)
6.       సమాసాలను ప్రతిపదార్థంలో చదివి సద్వినియోగం చేసుకోవటం మంచిది. (ఈ స్థాయిలో సమాసాల పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, విగ్రహం రాకపోయినా విడదీసే విధానం తెలిస్తే చాలు అని భావం.)
7.       ఏవైనా ప్రయోగవిశేషాలు గమనించటం- ఓహో, ఈ భావాన్ని వ్యక్తపరచాలంటే ఈ పదాన్ని సంస్కృతంలో ఇట్లా వాడతారన్నమాట.. బాగుంది.అని నుడికారాన్ని గమనించటం వల్ల భవిష్యత్తులో మంచి లాభం జరుగుతుంది. అవి సూచించే ప్రయత్నం చేయాలని అనుకున్నా. సమయాభావం, మరియు కార్యభారం వల్ల చేయలేకపోయాను. కనుక మీరు స్వయంగా గ్రహించటం, గుర్తించి ప్రయోగాలలో అలవాటు చేసుకోవటం మంచిది.
8.       చివరగా స్వీయపరీక్ష- (లేదా ఎవరి చేతనైనా అడిగించుకోటం)
అ) ఏదైనా సంస్కృతపదాన్ని చదివి, తెలుగు చూడకుండా అర్థం గుర్తు తెచ్చుకోవటం.
ఆ) ఏదైనా తెలుగుపదాన్ని చదివి, సంస్కృతం చూడకుండా మూలపదం గుర్తు తెచ్చుకోవటం.
ఇ) అట్లాగే సంధి, సమాసం చూసుకోవటం
9.       ఇంత చేసేసరికి శ్లోకంలో పదాలన్ని నోటికి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు మరో రెండు మూడు సార్లు చదివేస్తే శ్లోకం నోటికి వచ్చేస్తుంది.
10.      చివ్వరగా సంస్కృతశ్లోకాన్ని చదువుతూ భావాన్ని లోపల అనుకోవటం. ఇక్కడ ఏ పదమూ ఆటంకం కలగకపోతే ఇంక ఆ శ్లోకం మనకు అవగతమైనట్టే.
          ఈ పద్ధతిని మీరిక్కడే కాదు, ఎక్కడైనా ఇతరత్రా కూడా వాడుకోవచ్చు. శ్లోకరూపంలో ఉన్నది, సానువాదం లభించిన ఏ సంస్కృతం గ్రంథాన్ని అయినా ఇట్లాగే చదివి లాభం పొందవచ్చు.
          ఇట్లా చేయటం వల్ల విషయం మొత్తం అవగతమై, సంస్కృతాన్ని మూలంనుంచే ఆనందించి, లాభం పొందుతారని ఆదరిస్తారని ఆశతో-
-మీ సంస్కృతానురాగిణి
సంకా ఉషారాణి