🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౨వ శ్లోకము
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౨వ శ్లోకము
🌺
మూలము
నిఖిలేషు ప్రవహన్తీం నిరుపాధివిమర్శయోగదృశ్యోర్మిమ్ ।
అజరామజామమేయాం కామపి వన్దే మహాశక్తిమ్ ॥౧.౧.౨॥
మూలము
నిఖిలేషు ప్రవహన్తీం నిరుపాధివిమర్శయోగదృశ్యోర్మిమ్ ।
అజరామజామమేయాం కామపి వన్దే మహాశక్తిమ్ ॥౧.౧.౨॥
🌺
పదవిభాగము
నిఖిలేషు ప్రవహన్తీమ్ నిరుపాధివిమర్శయోగదృశ్యోర్మిం అజరాం అజాం అమేయాం కామ్ అపి వన్దే మహాశక్తిం ॥౧.౧.౨॥
🌺
అన్వయము
నిఖిలేషు ప్రవహన్తీం నిరుపాధివిమర్శయోగదృశ్యోర్మిం అజరాం అజాం అమేయాం కామ్ అపి మహాశక్తిం వన్దే ॥౧.౧.౨॥
🌺
ప్రతిపదార్థము
నిఖిలేషు = అన్నిటియందు, ఇహలోక పరలోకముల యందు గల సమస్త వస్తువుల యందు
ప్రవహన్తీం = నిరంతరము ప్రవహించుచున్నదియు
నిరుపాధి-విమర్శ-యోగ-దృశ్యోర్మిం = దేశ, కాల, వస్తుకృత బేధము లేని ఆలోచనా రూపమగు యోగమునందు దర్శింపదగు తరంగములు గలిగినది
అజరాం = ముసలితనము లేనిదియు
అజాం = పుట్టుక లేనిదియు
అమేయాం = కొలుచుటకు వీలుకానిదియు
కామ్ అపి = ఒకానొక, ఇట్టిదని చెప్పుటకు వీలుగాని
మహా-శక్తిం = గొప్పశక్తిని
వన్దే = నమస్కరించుచున్నాను
🌺
తాత్పర్యము
సృష్టిలోని సమస్త వస్తువులయందును ఎడతెగక ప్రవహించుచు దేశ కాల వస్తు కృత పరిమితులు లేని ఆలోచన గల యోగమునందు దర్శింపదగిన తరంగములు గలిగి, ముసలితనము, పుట్టుక, కొలత, లేని ఇట్టిదని వివరింపరాని మహాశక్తికి నమస్కరించుచున్నాను.
No comments:
Post a Comment