Friday, September 14, 2018

ఉమాసహస్రం - 1.1.4 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
ప్రథమశతకము, ప్రథమస్తబకము
౪వ శ్లోకము
🌺
మూలము
పరమః పురుషో నాభిర్లోకానాం సత్య ఉచ్యతే లోకః ।
పరితస్తతః సరన్తీ సూక్ష్మా శక్తిస్తపో లోకః ॥౧.౧.౪॥

🌺
పదవిభాగము
పరమః పురుషః నాభిః లోకానాం సత్యః ఉచ్యతే లోకః పరితః తతః సరన్తీ సూక్ష్మా శక్తిః తపోలోకః ॥౧.౧.౪॥

🌺
అన్వయము
పరమః పురుషః లోకానాం నాభిః సత్యలోకః ఉచ్యతే తతః పరితః సరన్తీ సూక్ష్మా శక్తిః తపోలోకః ఉచ్యతే ॥౧.౧.౪॥

🌺
ప్రతిపదార్థము
పరమః = సర్వోత్తముడయిన
పురుషః = పురుషుడు
లోకానాం = లోకములకు
నాభిః = కేంద్రము అయిన
సత్యలోకః = సత్య లోకముగా
ఉచ్యతే = చెప్పబడుచున్నాడు
తతః పరితః = ఆయన చుట్టు
సరన్తీ = వ్యాపించుచున్న
సూక్ష్మా = సూక్ష్మమగు
శక్తిః = శక్తి
తపోలోకః = తపోలోకమని
ఉచ్యతే = చెప్పబడుతున్నది

🌺
తాత్పర్యము
పూర్వశ్లోకమున చెప్పబడ్డ పరమపురుషుడే సకల లోకములకు కేంద్ర స్థానమయిన సత్యలోకమని చెప్పబడుచున్నాడు. ఆయన చుట్టు వ్యాపించియున్న సూక్ష్మశక్తి తపోలోకమని చెప్పబడుచున్నది.

🌺
విశేషవివరణ
రథచక్రపు మధ్యభాగమును ఆశ్రయించి, ఆకులన్నియు ఉన్నట్లుగా పరమ పురుష రూపమయిన సత్యలోకమునందు సర్వలోకములు నెలకొని యున్నవి. ప్రాణినుండి ప్రాణమును వేరు చేయలేనట్లు పరమ పురుషుని నుండి వేరుగాని ఆయన సహజసూక్ష్మశక్తి యున్నది.

No comments:

Post a Comment