Tuesday, September 18, 2018

ఉమాసహస్రం - 1.1.20 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకం, ప్రథమస్తబకం
౨౦వశ్లోకము
🌺
మూలము
మన్యన్తే కేఽపి ఘనం పర్వతముక్తం నిగూఢయా వాచా ।
ప్రాదుర్భవతి గభీరధ్వని రవిషహ్యా యతః శక్తిః ॥౧.౧.౨౦॥
🌺
పదవిభాగము
మన్యన్తే కే అపి ఘనం పర్వతం ఉక్తం నిగూఢయా వాచా ప్రాదుర్భవతి గభీరధ్వనిః అవిషహ్యా యతః శక్తిః ॥౧.౧.౨౦॥
🌺
ప్రతిపదార్థము
కే అపి = కొందరు
నిగూఢయా = రహస్యమయిన
వాచా = వాక్కుతో
ఉక్తం = చెప్పబడిన
ఘనం = మేఘమును
పర్వతం = పర్వతమునుగా
మన్యన్తే = భావించుచున్నారు
యతః = ఏ మేఘము నుండి
గభీరధ్వనిః = గంభీరమయిన ధ్వని గల
అవిషహ్యా = సహించరాని
శక్తిః = విద్యుద్రూపమగు శక్తి
ప్రాదుర్భవతి = ప్రకటితమగుచున్నదో
🌺
తాత్పర్యము
కొందరు రహస్యమయిన వేదభాషతో మేఘమును పర్వతముగా చెప్పుచున్నారు. ఆ పర్వతము నుండి గంభీరమయిన ఘోష గలిగి సహింపరాని విద్యుచ్ఛక్తి వ్యక్తమగుచున్నది.
🌺
విశేషవివరము
నిరుక్త నిఘంటువు నందు గల ముప్పది మేఘ నామములలో పర్వతమున్నది.

No comments:

Post a Comment