Tuesday, September 18, 2018

ఉమాసహస్రం - 1.1.15 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమస్తబకం, ప్రథమశతకము
౧౫వశ్లోకము
🌺
మూలము
భాసురహేమాభరణాం బహుశోభామీశ్వరప్రమోదకలామ్ ।
మూర్తిం పావనకీర్తిం తాం హైమవతీముమామాహుః ॥౧.౧.౧౫॥
🌺
పదవిభాగము
భాసుర-హేమ-ఆభరణాం బహు-శోభాం ఈశ్వర-ప్రమోద-కలామ్ మూర్తిం పావన-కీర్తిం తాం హైమవతీం ఉమాం ఆహుః ॥౧.౧.౧౫॥
🌺
అన్వయము
భాసురహేమాభరణాం బహుశోభామ్ ఈశ్వరప్రమోదకలాం పావనకీర్తిం మూర్తిం తాం హైమవతీమ్ ఉమామ్ ఆహుః ॥౧.౧.౧౫॥
🌺
ప్రతిపదార్థము
భాసుర-హేమ-ఆభరణాం = ప్రకాశించుచున్న బంగారు అలంకారములు గలదియు
బహు-శోభాం = మిక్కిలి కాంతి కలదియు
ఈశ్వర-ప్రమోద-కలాం = ఈశ్వరుని ఆనందకలయు
మూర్తిం = దేహధారిణియు
పావన-కీర్తిం = నిర్మలమయినకీర్తి కలదియు అగు
తాం = ఆ
హైమవతీం = హైమవతిని
ఉమాం = ఉమనుగా
ఆహు = చెప్పుచున్నారు
🌺
తాత్పర్యము
ప్రకాశించుచున్న బంగారు అలంకారములతో అధికమగు కాంతిని కలిగి ఈశ్వరుని ఆనందకలయై, దేహధారిణియై, నిర్మలకీర్తి కల ఆహైమవతిని ఉమగా చెప్పుచున్నారు.
🌺
విశేషవివరణ
హిమవంతుని కూతురు హైమవతి అనునదే కాక కవి బంగారుమయమగు జ్యోతి అను అర్థమున ఉపనిషత్తులో చెప్పబడిన కథను గుర్తు చేయుచున్నారు.

No comments:

Post a Comment