Tuesday, September 18, 2018

ఉమాసహస్రం - 1.1.17 (కావ్యకంఠ గణపతి ముని)

🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౭వ శ్లోకము
🌺
మూలము
పల్లవమృదు వేదిగతజ్వలనపవిత్రం మహార్ఘమణికాన్తమ్ ।
నవచన్ద్రఖణ్డసౌమ్యం శివసుదృశస్తత్ స్మరామి వపుః ॥౧.౧.౧౭॥
🌺
పదవిభాగం
పల్లవమృదు వేదిగతజ్వలనపవిత్రం, మహార్ఘమణికాన్తం నవచన్ద్రఖణ్డసౌమ్యం శివసుదృశః తత్ స్మరామి వపుః ॥౧.౧.౧౭॥
🌺
అన్వయము
పల్లవమృదు వేదిగతజ్వలనపవిత్రం నవచన్ద్రఖణ్డసౌమ్యం మహార్ఘ మణికాన్తమ్ తత్ శివసుదృశః వపుః స్మరామి ॥౧.౧.౧౭॥
🌺ప్రతిపదార్థము
పల్లవమృదు = చిగురుటాకువలే కోమలమయినదియు
వేదిగతజ్వలనపవిత్రం = యజ్ఞ వేదిక యందలి అగ్ని వలె పవిత్రమయినదియు
నవచన్ద్రఖణ్డసౌమ్యం = నూతనమయిన చంద్రకళ వలె ప్రసన్నమయినదియు అగు
మహార్ఘ = గొప్పదయిన
మణికాన్తమ్ = మణివలె మనోహరమయిన
తత్ = ఆ
శివసుదృశః = శివుని కాంత యొక్క
వపుః = శరీరమును
స్మరామి = తలచుచున్నాను
🌺
తాత్పర్యము
చిగురుటాకు వలె మెత్తనిదయి, యజ్ఞవేదికయందలి అగ్నిహోత్రము వలే పవిత్రమయినదయి గొప్పవిలువ గల మణివలె మనోహరమయినదయి, బాలచంద్రకళవలె ప్రసన్నమయిన శివపత్ని అయిన ఉమ దివ్య దేహమును తలచుచున్నాను.
🌺
విశేషవివరణ
కవి తన యోగబలము వల్లనో స్వాభావిక సామర్థ్యము వల్లనో జన్మాంతరమునందు గానీ లోకాంతరము నందు గానీ తాను చూచిన ఉమాదేవి దివ్య దేహమును స్మరించుచున్నారు.

No comments:

Post a Comment