🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౭వ శ్లోకము
🌺
మూలము
ధూమాన్తరోష్మకల్పా శుద్ధజ్వాలోపమా చ యా శక్తిః ।
తాం దివమాహుః కేచన పరమం వ్యోమాపరే ప్రాహుః ॥౧.౧.౭॥
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౭వ శ్లోకము
🌺
మూలము
ధూమాన్తరోష్మకల్పా శుద్ధజ్వాలోపమా చ యా శక్తిః ।
తాం దివమాహుః కేచన పరమం వ్యోమాపరే ప్రాహుః ॥౧.౧.౭॥
🌺
పదవిభాగము
ధూమాంతరోష్మకల్పా శుద్ధజ్వాలోపమా చ యా శక్తిః తాం దివం ఆహుః కేచన పరమం వ్యోమ అపరే ప్రాహుః ॥౧.౧.౭॥
🌺
అన్వయము
ధూమాన్తరోష్మకల్పా చ శుద్ధజ్వాలోపమా యా శక్తిః అస్తి తాం కేచన దివమ్ ఆహుః అపరే పరమం వ్యోమ ప్రాహుః ॥౧.౧.౭॥
🌺
ప్రతిపదార్థము
ధూమాన్తరోష్మకల్పా = పొగ మధ్యనున్న, వేడిమితో సమానమయిన
చ = మరియు
శుద్ధజ్వాలోపమా = శుద్ధమయిన జ్వాలతో పోలిక గల
యా = ఏ
శక్తిః = శక్తి
అస్తి = ఉన్నదో
తాం = ఆ శక్తిని
కేచన = కొందరు
దివం = స్వర్గమని
ఆహుః = చెప్పుచున్నారు
అపరే = మరి కొందరు
పరమం = పరమమయిన
వ్యోమ = ఆకాశమని
ప్రాహుః = చెప్పుచున్నారు
🌺
తాత్పర్యము
పొగమధ్యనున్న వేడిమి వంటి శుద్ధ జ్వాలా తుల్యమయిన శక్తి స్వర్గమని కొందరనగా మరి కొందరు పరమాకాశమని చెప్పుదురు.
🌺
విశేషవివరణ
సృష్టికి ఉపాదానకారణములయిన ద్రవ్యములతో గూడి జనలోకమను పేరుతో పరమపురుషుని నుండి వెలువడు పదార్థజాలము స్వర్గమని కొందరందురు. ఆ పదార్థజాలమందున్న జ్వాలా తుల్యమయిన శక్తి స్వర్గమని మరికొందరు చెప్పుచున్నారు. ఆ శక్తి పరమాకాశమని కొందరు భావించుచున్నారు.
No comments:
Post a Comment