🌺ఉమాసహస్రము🌺
🌺ప్రథమశతకము, ప్రథమస్తబకము
౧౪ వశ్లోకము
🌺
మూలము
దివ్యపుమాకృతిమీశే బిభ్రతి లీలార్థమస్య రమణాయ ।
దివ్యవనితాకృతిం సా బభార మాతా చ భువనానామ్ ॥౧.౧.౧౪॥
🌺
పదవిభాగము
దివ్య-పుమ్-ఆకృతిం ఈశే బిభ్రతి లీలార్థం అస్య రమణాయ దివ్య-వనితా-ఆకృతిం సా బభార మాతా చ భువనానామ్ ॥౧.౧.౧౪॥
🌺
అన్వయము
ఈశే లీలార్థం దివ్యపుమాకృతిం బిభ్రతి సతి అస్య రమణాయ సా భువనానాం మాతా చ దివ్యవనితాకృతిం బభార ॥౧.౧.౧౪॥
🌺
ప్రతిపదార్థము
ఈశే = పరమపురుషుడగు ఈశ్వరుడు
లీలార్థం = లీల కొఱకు
దివ్య-పుమ్-ఆకృతిం = దివ్యమైన పురుష రూపమును
బిభ్రతి సతి = ధరించినవాడు కాగా
అస్య = ఆ ఈశ్వరుని యొక్క
రమణాయ = క్రీడ కొఱకు
సా = ఆ
భువనానాం మాతా చ = జగజ్జనని కూడ
దివ్య-వనితా-ఆకృతిం = దివ్యస్త్రీ రూపమును
బభార = ధరించెను
🌺
తాత్పర్యము
పరమేశ్వరుడు విలాసార్థమై దివ్యపురుషాకృతిని ధరించగా, ఆయనను ఆనందింపచేయుటకై, ఆ జగజ్జనని కూడ దివ్యస్త్రీ రూపమును ధరించెను.
🌺
విశేషవివరణ
దివ్యశబ్దమునకు, చర్మచక్షువులకు గోచరించని, భావనకందని, తేజోమయమని అర్థముకాగా జగన్మాత, ఈశ్వరుడు ధరించిన రూపములు తేజోమయములని అర్థము.

No comments:
Post a Comment